గోదావరిపై కొత్త ట్రైబ్యునల్ వేయాలని ఏపీ డిమాండ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: புது தில்லி

దిల్లీలో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల జల వివాదాల సమావేశంలో ఏపీ కీలక డిమాండ్ చేసింది. గోదావరిపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేల్చాలని కోరింది. రాష్ట్ర విభజన నాటి నీటి లభ్యతను శాస్త్రీయంగా గణించిన తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని స్పష్టం చేసింది. సీసీడబ్ల్యూసీ లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.