హైదరాబాద్లో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లో పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి ఉపేక్ష ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. క్యూర్ పరిధిలో చెత్త ఎక్కడా కనిపించడానికి వీల్లేదని, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు.