ఢిల్లీలో కొత్త నిబంధన: ప్రైవేట్ పాఠశాలల భూ కేటాయింపులపై ప్రభుత్వ మార్గదర్శకాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో ప్రభుత్వ లేదా మున్సిపల్ సంస్థల భూములను కేటాయించి ప్రైవేట్ పాఠశాలలను ఏర్పాటు చేసే సొసైటీలు, ట్రస్టులు తప్పనిసరిగా లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ పొందాలని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీ పాఠశాల విద్య నిబంధనలు-1973 సవరణల ప్రకారం, భూమి కొనుగోలు లేదా కేటాయింపునకు ముందే స్థానిక అవసరాలను అంచనా వేసి ఈ ధ్రువీకరణ పత్రం తీసుకోవడం ఇకపై యం అని అధికారులు స్పష్టం చేశారు.