'నిద్రలో ఉన్న విద్యార్థి హత్య': గోరఖ్‌పూర్‌లో బీఎస్సీ విద్యార్థి దారుణ హత్య
రిపోర్టర్: గోపి
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ పరిధిలోని జయంటిపూర్ గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న శుభమ్ మిశ్రా (19) అనే బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరగగా, తల్లిదండ్రులు తండ్రి వైద్యం కోసం లక్నోలో ఉండటంతో బాలుడు ఇంట్లో ఉన్నాడు. సమాచారం అందుకున్న ఖజ్ని సీఓ అనుజ్ సింగ్ మరియు ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.