లోక్ అదాలత్ వేదికగా సత్వర నూతన న్యాయ పరిష్కారాలు

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అచ్చంపేట

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట జూనియర్ సివిల్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో వివిధ రకాల 652 కేసులను రాజీమార్గంలో పరిష్కరించినట్లు జడ్జి స్పందన తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కేసుల ద్వారా మూడు లక్షల తొంబై ఆరు వేల మూడు వందల రూపాయల జరిమానా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. చిన్నచిన్న కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోకుండా ఇలాంటి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.