కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఆహ్వానించిన ఎమ్మెల్యే బొజ్జు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం ప్రాంతంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఇతర పార్టీలను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్వయంగా పాల్గొని నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.