వీరనారి చాకలి ఐలమ్మ జయంతి రాష్ట్రస్థాయి వేడుకలకు బుచ్చయ్యకు ఆహ్వానం
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వేడుకలు సెప్టెంబరు 26న రవీంద్రభారతిలో జరగనున్న రాష్ట్రస్థాయి ఉత్సవాలకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి చెందిన రజక సంఘం రాష్ట్ర నాయకులు ఎలిమినేటి బుచ్చయ్యకు ఆహ్వానం అందింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఐలమ్మ జయంతి వేడుకలకు ఆహ్వానం అందడం సంతోషంగా ఉందన్నారు.