ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇళ్ల స్థలాల విక్రయంపై ఐదుగురిపై కేసు నమోదు
రిపోర్టర్: రమేష్
స్థలం: లక్కవరపుకోట
విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం ఖాసాపేటలో ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇళ్ల స్థలాలు విక్రయించి మోసం చేశారంటూ అందిన ఫిర్యాదుపై మక్కెన మహేష్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2013లో విశాఖ ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు తప్పుడు సర్వే నంబర్లతో స్థలాలు అంటగట్టి మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించగా ఎస్సై రామకృష్ణ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.