బోన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. అండగా ఉంటామంటూ హామీ!

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పెనుబల్లి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచందర్రావుబంజర్ కు చెందిన బన్నె మణికంఠ యాదవ్ బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. మణికంఠ పరిస్థితిని తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వీడియో కాల్ ద్వారా పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు.

భయపడొద్దని, పార్టీ తరఫున చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే స్వయంగా ఇంటికి వచ్చి కలుస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు.