ట్రైన్ లో నకిలీ టీటీఈ కలకలం: నిద్రలేపి టికెట్లు తనిఖీ చేసిన మహిళ
రిపోర్టర్: హరి
స్థలం: Maharashtra
మహారాష్ట్ర నుంచి బీహార్ వెళ్తున్న రైలులో ఒక మహిళ నకిలీ టీటీఈగా నటించి ప్రయాణికులను మోసం చేసినట్లు ప్రయాణికురాలు నీతూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తెల్లవారుజామున జనరల్ కంపార్ట్మెంట్ లో ప్రయాణికులను నిద్రలేపి టికెట్లు తనిఖీ చేస్తుండగా ఆమె వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన ప్రయాణికులు గుర్తింపు కార్డు కోరడంతో అసలు విషయం బయటపడింది. ఎలాంటి యూనిఫాం లేదా ఐడీ కార్డ్ లేకపోవడంతో నిలదీయగా ఆ మహిళ అక్కడ నుంచి పరారైంది.