హెరాయిన్ కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్: పటాన్చెరు ఎక్సైజ్ సీఐ శ్రవణ్ కుమార్ హెచ్చరిక

రిపోర్టర్: నరేష్ స్థలం: పటాన్‌చెరు

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పటాన్చెరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. హెరాయిన్ కేసులో గత కొంతకాలంగా పరారీలో ఉన్న పశ్చిమ బెంగాల్ కు చెందిన నిందితుడిని ప్రత్యేక బృందం రాష్ట్రం దాటి వెళ్లి విజయవంతంగా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. సంగారెడ్డి న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.