హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ది ప్యారడైజ్ ప్రీమియర్ చూడాలన్న నాని
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానున్న నేపథ్యంలో, సెప్టెంబర్ 23 రాత్రి హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు పోలీసు శాఖను ఆయన కోరారు. గతంలో పుష్ప 2 ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో భద్రతా నిబంధనలు పాటిస్తామని ఆయన స్పష్టం చేశారు.