వినాయక ఉత్సవాల వేళ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల పిలుపు
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై కమిటీ సభ్యులతో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ బాల సురేశ్‌బాబు, ఎస్ఐ రాజారెడ్డి మాట్లాడుతూ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. బలవంతపు చందాలు వసూలు చేయరాదని, మైనర్లను పంపకూడదని హెచ్చరించారు. డీజేలకు పరిమిత శబ్దం, విద్యుత్ భద్రత పాటించాలని, అత్యవసర వాహనాలకు మార్గం ఇవ్వాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కమిటీ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.