బెంగళూరు ఐఐఎస్‌ వేదికగా సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను ప్రారంభించనున్న కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషి

రిపోర్టర్: సతీష్ స్థలం: Bengaluru

కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వేదికగా సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. సమాజంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి వినూత్న పరిష్కారాలు కనుగొనేలా వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.