ఐకేపీ వీఓఏల సమస్యలు: ఆన్లైన్ పనుల భారం తగ్గించాలని డిమాండ్

రిపోర్టర్: User స్థలం: ఝరాసంగం

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో పద్దెనిమిదేళ్లుగా పేదరిక నిర్మూలన సంస్థలో సేవలందిస్తున్న ఐకేపీ వీఓఏలపై విపరీతమైన ఆన్లైన్ పనుల భారం పడుతోంది. శ్రీనిధి, బ్యాంకు లింకేజీ తదితర యాప్ లతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ప్రధాన కార్యదర్శి రాజు పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన వీఓఏల కుటుంబాలకు తక్షణమే ఇన్సూరెన్స్ పాలసీలు వర్తింపజేసి ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.