కుప్పం ఎయిర్పోర్టు నిర్మాణానికి తితిదే భూములు కేటాయిస్తూ బోర్డు నిర్ణయం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తిరుపతి

కుప్పం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణ అవసరాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం భూములు కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కిలకిపోడులో ఉన్న సుమారు ఐదు ఎకరాల తితిదే భూమిని ఎయిర్పోర్టుకు అప్పగించేందుకు బోర్డు అంగీకరించింది. ఎకరాకు పదహారు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించడంతో పాటు ప్రభుత్వ అనుమతి పొందాలని షరతు విధించారు. అలాగే శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం అలిపిరిలో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీ కేంద్రాలను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.