బెంగళూరులో కాలేజీ విద్యార్థిని దారుణంగా కత్తితో పొడిచి చంపిన వైనం

రిపోర్టర్: రాజేష్ స్థలం: బెంగళూరు

బెంగళూరులోని నాగరబావి ప్రాంతంలో ఉన్న మహేష్ పీయూ కాలేజీ సమీపంలో బుధవారం మధ్యాహ్నం పీయూ మొదటి సంవత్సరం చదువుతున్న పందొమ్మిదేళ్ల యోగేష్ను కొందరు దుండగులు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారని పోలీసులు తెలిపారు. క్లాస్ జరుగుతున్న సమయంలో ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లిన యోగేష్తో ఐదు ఆరుగురు యువకులు గొడవపడి ఛాతీపై కత్తితో పొడవడంతో అతను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని, ఈ ఘటనపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పశ్చిమ మండల డీసీపీ యతీష్ తెలిపారు.