'రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు సరికావు': సతీశ్ సాలియన్ పరువు నష్టం నోటీసులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలో దిశ సాలియన్ మృతి కేసు విచారణను రాజకీయ ప్రేరేపితమంటూ తప్పుపట్టిన శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) నేత అనిల్ దేశ్‌ముఖ్‌లపై ఆమె తండ్రి సతీశ్ సాలియన్ రూ. 500 కోట్ల పరువు నష్టం నోటీసులు జారీ చేశారు. తన కుమార్తె మృతిపై న్యాయపోరాటం చేస్తుంటే తనను వేరేవారికి తొత్తుగా వాడుకుంటున్నారంటూ నిరాధార ఆరోపణలు చేశారని, వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో డిమాండ్ చేశారు.