మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు: ఎమ్మిగనూరులో ఘన నివాళి

రిపోర్టర్: AMPAIAH ACHARI స్థలం: ఎమ్మిగనూరు

ఎమ్మిగనూరులోని బుట్టా ఫౌండేషన్ కార్యాలయంలో మహాత్మా గాంధీ అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా సమన్వయకర్త బుట్టా రేణుక ఆదేశాల మేరకు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సత్యం అహింస సిద్ధాంతాలను అలాగే శాస్త్రిజీ దేశభక్తి కర్తవ్యనిష్ఠను కొనియాడుతూ పలువురు ఘనంగా స్మరించుకున్నారు.