కూటమిలో నగరపాలక స్థానాల సర్దుబాటు కసరత్తు: జనసేనకు కీలక కార్పొరేషన్లు కేటాయింపు
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని పదిహేడు నగరపాలక సంస్థల మేయర్ స్థానాల పంపకాలపై కూటమి పార్టీల మధ్య చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని అమరావతి వర్గాలు వెల్లడించాయి. జనసేన పార్టీకి విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ స్థానాలను కేటాయించే దిశగా ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీలో దీనిపై పూర్తి స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.