ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవేపై లారీని ఢీకొన్న బస్సు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లాలోని దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై వైరా ఎగ్జిట్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని స్థానిక పోలీసులు తెలిపారు. దేవరపల్లి నుంచి ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయిందని, డ్రైవర్ తీవ్రంగా గాయపడి క్యాబిన్లో ఇరుక్కుపోయాడని వెల్లడించారు. వెంటనే స్పందించిన ప్రయాణికులు, స్థానికులు డ్రైవర్ను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.