చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్న సూదికొండ ప్రధాన రహదారి
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సూదికొండ - కాశీబుగ్గ MDO కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై చెత్త పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. రోడ్డు పక్కన ఉన్న మున్సిపల్ డంపింగ్ బిన్ నిండిపోవడంతో చెత్త రోడ్డుపైకి వచ్చి పడుతోంది. వర్షాలకు ఆ చెత్త తడిచి మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శిష్టు గోపి డిమాండ్ చేశారు.