తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం రూ. 6.93 కోట్లు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం గురువారం ఒక్కరోజే రూ. 6.93 కోట్లుగా నమోదైంది. తిరుమల చరిత్రలో ఒకరోజు హుండీ ఆదాయంలో ఇది రెండో అత్యధిక మొత్తమని టీటీడీ వెల్లడించింది. భక్తులు సమర్పించిన ఈ పవిత్ర నిధులను ఆలయ నిర్వహణ, నిత్య అన్నప్రసాదం, విద్య, వైద్య సేవల అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తిగా వినియోగిస్తున్నారు.