జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న కమిటీ కుర్రోళ్లు చిత్ర బృందం
రిపోర్టర్: వెంకట్
స్థలం: New Delhi
భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో కమిటీ కుర్రోళ్లు చిత్రం రెండు కేటగిరీల్లో పురస్కారాలు అందుకుంది. నిర్మాత నిహారిక కొణిదెల, దర్శకుడు యదు వంశీ ఉత్తమ తెలుగు చిత్రంగా రజత కమలం అవార్డును అందుకోగా, పి. రవికుమార్ ఉత్తమ మేకప్ విభాగంలో అవార్డు గెలుచుకున్నారు. ఈ వేడుకలో నాగబాబు, పద్మజ కొణిదెల తదితర చిత్ర బృంద సభ్యులు పాల్గొని ఈ చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా ఆస్వాదించారు.