కర్నూలులో టీటీడీ కల్యాణ మండపం అద్దె భారీ తగ్గింపు
రిపోర్టర్: హరి
స్థలం: కర్నూలు
కర్నూలు నగరవాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. టీటీడీ కల్యాణ మండపం రోజువారీ అద్దెను రూ.1.40 లక్షల నుంచి రూ.70 వేలకు సగానికి తగ్గించింది. ధర ఎక్కువగా ఉండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సామాన్యులు తక్కువ ఖర్చుతో వేడుకలు జరుపుకునే అవకాశం లభించింది.