మహబూబాబాద్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనం
రిపోర్టర్: కిరణ్
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఎస్పీ మహబూబాబాద్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ప్రదర్శించిన ధైర్యం, ఆత్మగౌరవం మరియు సామాజిక న్యాయం కోసం సాగించిన పోరాటం నేటి తరానికి ఎప్పటికీ ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.