ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు: సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యతనిచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి
రిపోర్టర్: శివ
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో సామాన్య భక్తులకే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే ప్రతి ఒక్కరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గౌరవ రాష్ట్రపతి మరియు ముఖ్యమంత్రి పర్యటనల నేపథ్యంలో భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని ఆయన పేర్కొన్నారు.