అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనం: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-6లోకి ఆఫ్ఘనిస్థాన్
రిపోర్టర్: హరి
స్థలం: New Delhi
అంతర్జాతీయ క్రికెట్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్భుత మైలురాయిని సాధించిందని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఐసీసీ వన్డే పురుషుల టీమ్ ర్యాంకింగ్స్ లో తొలిసారిగా అఫ్ఘాన్ జట్టు టాప్-6 స్థానాన్ని కైవసం చేసుకుంది. మాజీ ప్రపంచ చాంపియన్లైన శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లను వెనక్ కి నెట్టి ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 2009లో వన్డేల్ లో అరంగేట్రం చేసిన ఈ జట్టు, వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్ లో తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.