పురుషన్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం ప్రముఖ నటుడు విశాల్‌కు గాయాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: గోవా

తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడిగా పేరుపొందిన విశాల్ గోవాలో జరుగుతున్న పురుషన్ సినిమా షూటింగ్ సమయంలో భారీ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించగా, వైద్యుల సూచన మేరకు విశాల్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.