బీసీల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి: జాతీయ బీసీ సమితి హెచ్చరిక

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల బైపాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత, బీసీ రక్షణ చట్టం, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సమితి నాయకులు స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి వారు హెచ్చరిక జారీ చేశారు.