జాహ్నవిని ఆశీర్వదించిన బలగాలు: ఘనంగా జరిగిన జవాను కుమార్తె వేడుక

రిపోర్టర్: GANESH BBL స్థలం: విశాఖపట్టణం

విశాఖపట్టణంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ కనకారావు కుమార్తె జాహ్నవి రజస్వల వేడుకకు పలువురు మాజీ, ప్రస్తుత పారామిలిటరీ జవాన్లు హాజరయ్యారు. తెలుగు బీఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్ గ్రూప్ సభ్యులు, సెంట్రల్ ఎక్స్ పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు స్వయంగా వెళ్లి జాహ్నవిని ఘనంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ భరత్ రెడ్డి, కె. చంద్ర కుమార్ తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు.