మున్సిపల్ ఎన్నికల్ లో వైకాపా ఘోర పరాజయం: కంచుకోటల్లోనూ తుడిచిపెట్టుకుపోయిన వైనం
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో వైకాపా ఘోర పరాజయం చవిచూసిందని రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల కంటే దారుణంగా ఆ పార్టీ కంచుకోటల్లోనూ ప్రాభవం కోల్పోయిందని స్పష్టం చేశారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలలోనూ వైకాపా ప్రభావం చూపలేకపోయిందని, పోలింగ్ కు ముందే అనేక స్థానాలు కూటమి పరం అయ్యాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను విస్మరించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.