రాజాపేటలో నర్సాపురం మహిళా భవనం: ఘనంగా భూమి పూజ

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం నర్సాపురం గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో మహిళా భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎమ్మ శిరీష నాగరాజు, పంచాయతీ కార్యదర్శి మమత, ఉప సర్పంచ్ నారపాక కరుణాకర్, వార్డు సభ్యులు, వర్క్ ఇన్స్పెక్టర్ బాలరాజు, వి బి కే స్వరూప, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నర్సాపురం గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.