ఎన్నికల ఓటమికి ఇరాన్ ఘర్షణలే కారణమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: వాషింగ్టన్
అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీ ఎదుర్కొన్న ఓటములకు ఇరాన్ తో జరిగిన ఘర్షణలే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వైట్‌హౌస్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెట్రోల్ ధరల పెరుగుదల ఎన్నికలపై ప్రభావం చూపినప్పటికీ, జాతీయ భద్రత కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలను గట్టిగా సమర్థించుకున్నారు. రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆయన కుండబద్దలు కొట్టారు.