శాంతిభద్రతల శాఖను ఆర్టీఐ చట్టం పరిధి నుంచి మినహాయించిన తమిళనాడు ప్రభుత్వం

రిపోర్టర్: హరి స్థలం: తమిళనాడు

తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పబ్లిక్ మరియు లా అండ్ ఆర్డర్ శాఖను సమాచార హక్కు చట్టం పరిధి నుంచి మినహాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆర్టీఐ చట్టం సెక్షన్ 24(4) కింద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో శాంతిభద్రతల అంశాలకు సంబంధించిన సమాచారం ఇకపై ఆర్టీఐ ద్వారా అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు.