అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి*

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్:* మండలంలోని పెద్దకొండూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్ బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు.కార్యక్రమంలో ముత్యాలమ్మ ఆలయ చైర్మన్ కొమురెల్లి ప్రతాపరెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.