బ్యాంకుల సమ్మె వేళ ఏటీఎం లావాదేవీల ఛార్జీలు రద్దు చేసిన ఎస్బీఐ

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు జరగనున్న మూడు రోజుల బ్యాంకుల సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు కీలక ఊరటనిచ్చింది. ఈ మూడు రోజుల పాటు ఏటీఎం లావాదేవీలపై వర్తించే ఛార్జీలను మినహాయిస్తున్నట్లు ఎస్బీఐ అధికారులు ప్రకటించారు. సమ్మె కారణంగా బ్రాంచ్ సేవలు నిలిచిపోనున్న తరుణంలో కస్టమర్లు డిజిటల్ సేవలు, ఏటీఎంలను వినియోగించుకోవాలని సూచించారు.