ప్రజల కోసం సన్న బియ్యం తక్కువ ధరకే అందించనున్న చంద్రబాబు సర్కార్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి ప్రజలకు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సన్న బియ్యాన్ని కిలో రూ.49కు, సూపర్‌ఫైన్ బియ్యాన్ని రూ.50కు విక్రయించాలని సూచించారు. ధరణి బ్రాండ్ బియ్యం విక్రయాలను రైతుబజార్ల నుంచి మున్సిపాలిటీలు, మండల కేంద్రాలకు విస్తరించడంతో పాటు మొబైల్ వాహనాల ద్వారా ప్రజలకు అందించాలని స్పష్టం చేశారు.