డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలిలో డీఎస్సీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట అప్పన్న డిమాండ్ చేశారు. డీఎస్సీ పరీక్షల్లో చోటుచేసుకున్న అనుమానాస్పద వ్యవహారాలపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని, తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.