రాయచోటి ఘాట్ లో ఘోర ప్రమాదం.. సజీవ దహనమైన ఇద్దరు

రిపోర్టర్: Alfa News స్థలం: రాయచోటి

అన్నమయ్య జిల్లా రాయచోటి ఘాట్ రోడ్డులో సిమెంట్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. రాయచోటి నుంచి కడపకు వెళ్తున్న ఈ వాహనం, మలుపు వద్ద అదుపుతప్పి అడవిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

మంటల తీవ్రతకు అడవికి నిప్పు అంటుకోవడంతో అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎండిపోయిన అడవి కావడంతో ప్రమాద తీవ్రతపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.