మార్చ్ 2027 నాటికి దేశంలో పూర్తిగా బ్యారియర్-ఫ్రీ టోల్ వ్యవస్థ!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

దేశంలోని జాతీయ రహదారులపై మార్చ్ 2027 నాటికి బ్యారియర్-ఫ్రీ టోల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఫాస్టాగ్ పూర్తి స్థాయి అమలు వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.20 వేల నుంచి రూ.25 వేల కోట్ల వరకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. ముంబైలో వన్‌ట్యాగ్ సదుపాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.