సైబర్ మోసం గుట్టురట్టు: నకిలీ దీపావళి కానుకల లింక్ లపై సీఐ హెచ్చరిక

రిపోర్టర్: రాము స్థలం: మోమిన్‌పేట్

ప్రధానమంత్రి పేరుతో ఎనిమిది వేల రూపాయల దీపావళి కానుక వస్తుందంటూ వచ్చే నకిలీ వాట్సాప్ సందేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని మోమిన్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వెంకట్ ప్రజలను హెచ్చరించారు. గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేసి బ్యాంకు వివరాలు లేదా ఓటీపీలు పంచుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే ఒక తొమ్మిది వందల ముప్ పై నంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజల అప్రమత్తతే నేరాలకు అడ్డుకట్ట వేస్తుందని అన్నారు.