భక్తిశ్రద్ధలతో పులకించిన శ్రీ చక్రేశ్వరాలయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయంలో శనివారం స్వామివారికి వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో అర్చకులు మహేష్ తో పాటు పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.