అస్సాంలో భారీ అదానీ విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం శర్మ శంకుస్థాపన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Dhubri, Assam
అస్సాం రాష్ట్రంలోని ధుబ్రి జిల్లా చాపార్ ప్రాంతంలో రూ.48 వేల కోట్ల భారీ వ్యయంతో అదానీ పవర్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న 3,200 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శంకుస్థాపన చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు.