వైఎస్ విజయసాయి రెడ్డి నివాసానికి షర్మిల: రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎంపీ విజయసాయి రెడ్డి నివాసానికి వెళ్లి తన కుమార్తె వివాహ ఆహ్వానపత్రికను అందజేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. వైసీపీకి దూరమైన విజయసాయి రెడ్డిని షర్మిల స్వయంగా కలవడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి జగన్కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.