పొన్నూరులో విషాదం: చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

రిపోర్టర్: సతీష్ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. సరదాగా ఈతకు వెళ్లిన షేక్ షాజహాన్, సత్తార్ అనే ఇద్దరు విద్యార్థులు మంచినీటి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయిన యువకులు, నేడు శవాలై తేలడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.