లంచ్ బాక్స్‌లో నల్లటి పదార్థం కలకలం: నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
తక్కువ ధరకు వచ్చే నాన్‌బ్రాండెడ్ లంచ్ బాక్సుల వల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉందని షాలిని అస్వాల్ అనే మహిళ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన స్టీల్ బాక్స్ ప్లాస్టిక్ అంచును కత్తిరించి లోపల ఉన్న నల్లటి పదార్థాన్ని ఆమె బయటపెట్టారు. అయితే అది బ్యాక్టీరియా కాదని, కేవలం థర్మల్ ఇన్సులేషన్ మెటీరియల్ అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వివరణ ఇస్తున్నారు.