విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాల శాశ్వత హక్కు పట్టాలు అందజేసిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: సురేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న 28 వేలకుపైగా పేదలకు వారి ఇంటిపై శాశ్వత హక్కు కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్ల పట్టాలను అందజేశారు. కూడు, గూడు, గుడ్డ ఎన్టీఆర్ నినాదంతో పేదలందరికీ నివాస వసతి కల్పిస్తున్నామని, దశాబ్దాల కష్టాలకు నేటితో ముగింపు పలికామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన పట్టాలు పంపిణీ చేశారు.