భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

రిపోర్టర్: Madhu Bngr స్థలం: భువనగిరి

భువనగిరి పట్టణంలోని ముప్పై ఐదో వార్డు ఆర్బీ నగర్ లో మున్సిపల్ చైర్మన్ తంగాళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు సరికొత్త కార్డులను అందజేసి సంక్షేమ పథకాల ప్రాధాన్యతను అధికారులతో కలిసి వివరించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు.