తీవ్ర తుఫాను ముప్పు: భోగాపురం విమానాశ్రయంలో పదహారు సర్వీసులు రద్దు

రిపోర్టర్: వెంకట్ స్థలం: విశాఖపట్నం

అర్నబ్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చడంతో భోగాపురం విమానాశ్రయంలో 16 సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం, తీవ్రగాలుల దృష్ట్యా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మార్గాలలో నడిచే విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. తుపాను తీవ్రతను బట్టి రేపు కూడా మరికొన్ని సర్వీసులు రద్దు చేసే అవకాశం ఉందని ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటికే ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.